CM Chadrababu: సీఎం చంద్రబాబు వద్దకు ఏపీ ఫైబర్‌నెట్‌ పంచాయితీ.. ఏం అన్నారంటే?

by Yella Dhawani Reddy |

ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థను కనుమరుగు చేసేలా ఎండీ దినేష్ కుమార్‌ కుట్రలు పన్నుతున్నారంటూ ఛైర్మర్ జీవీరెడ్డి (GV Reddy) చేసిన ఆరోపణల సంగతి తెలిసిందే.

CM Chadrababu: సీఎం చంద్రబాబు వద్దకు ఏపీ ఫైబర్‌నెట్‌ పంచాయితీ.. ఏం అన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థను కనుమరుగు చేసేలా ఎండీ దినేష్ కుమార్‌ కుట్రలు పన్నుతున్నారంటూ ఛైర్మర్ జీవీరెడ్డి (GV Reddy) చేసిన ఆరోపణల సంగతి తెలిసిందే. ఇది కాస్తా ప్రభుత్వ, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో సీఎం చంద్రబాబును (CM Chadrababu) కలసి వివరణ ఇవ్వాలని జీవీ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జీవీ శనివారం సాయంత్రం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు జీవీ ప్రయత్నించగా.. తనకంతా తెలుసునని, అందరూ కలిసి పనిచేసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి ముందే ఈ విషయమై సీఎం చంద్రబాబు అధికారుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తను ఎంతో కష్టపడి వ్యవస్థను నిర్మించానని సీఎం చంద్రబాబు చెప్పారు. తనంతా తెలుసని, ఫైబర్‌నెట్‌లో అసలేం జరిగిందో ఇంటెలిజెన్స్ నుంచి తనకు సమాచారం ఉందన్నారు. తనకున్న తెలివితేటలను సంస్థ పురోగతికి ఉపయోగించాలని తెలిపారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి తాను సూచిస్తానని సీఎం చెప్పారు. అలాగే మంత్రితో కలిసి సమన్వయంతో పనిచేసుకోవాలని, సంస్థ ఎండీ, తాను కూర్చుని సమస్యను సర్దుబాటు చేసుకోవాలన్నారు. ఇక ఫైబర్‌నెట్ విషయంలో ఏం చేయాలో.. ఎలా చేయాలో కూడా తనకు తెలుసని సీఎం చెప్పినట్లు సమాచారం. ఇక మీదట ఎలాంటి వివాదాలు లేకుండా అధికారులతో కలిసి పనిచేయాలని జీవీకి సీఎం సూచించారు. ఇక ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసే బాధ్యతను మంత్రి జనార్దన్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన ఎండీ దినేష్‌కుమార్‌తో శుక్రవారం సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. అలాగే, జీవీరెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించి ఉన్న ఆధారాలను అందించాలంటూ మంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు పంపారు.

Next Story