TTD ట్రస్ట్‌కు భారీ విరాళాలు.. ఎంతంటే?

by Jakkula.Mamatha |

దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి.

TTD ట్రస్ట్‌కు భారీ విరాళాలు.. ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు తిరుమల(Tirumala) కొండకు చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు నిత్యం అన్న ప్రసాదం ఉచితంగా అందిస్తారు. అయితే ఈ ఉచిత అన్నదాన ప్రసాదానికి ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు సమర్పిస్తుంటారు. ఇందులో భాగంగా టీటీడీ ట్రస్ట్‌లకు ఎన్నారై భాగవతుల ఆనంద్ మోహన్ భారీ విరాళాలు అందజేశారు.

ఈ క్రమంలో ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1,00,01,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ రూ.10,01,116, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ.10,01,116, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10,01,116 టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని కలిసి విరాళాలు అందజేశారు. గురువారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడు(BR naidu)కి విరాళం చెక్కును అందించారు.

Next Story