- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pithapuram:డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకాలో అమానుష ఘటన.. అసలు ఏం జరిగిందంటే?
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపొందిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక వర్గాన్ని అగ్రకులం వెలివేసిన ఘటన వెలుగు చూసింది. దీంతో ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించాలని పలువురు డిమాండ్ చేశారు.
పిఠాపురం(Pithapuram) నియోజకవర్గానికి చెందిన మల్లం గ్రామంలో అగ్ర వర్ణాలు దళితులకు ఎవరు సాయం చేయోద్దంటూ చెప్పారు. దీంతో కిరాణా షాపులు, హోటల్ యజమానులు దళితులకు సరుకులు ఇవ్వలేదు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటంటే.. ఓ ఇంటి దగ్గర విద్యుత్ పని చేస్తున్న పల్లపు సురేష్ అనే వ్యక్తి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ క్రమంలో పలువురు దళితులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
ఈ క్రమంలో అతని మృతికి మేము కారణం కాదని నష్టపరిహారం చెల్లించడం కుదరదు అని వాదనలకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వీరికి వస్తువులను విక్రయించరాదని అగ్రవర్ణాలు ఆదేశించాయి. తమ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలతో చర్చించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో RDO రంగంలోకి దిగారు. ఆర్డీవో ఇరు వర్గాలతో చర్చించి గొడవ సద్దుమణిగేలా చేశారు.






