యువగళంపై మతిలేదా అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు?: అసలు ఎంపీ ఏమన్నారంటే!

by Disha Web Desk 21 |
యువగళంపై మతిలేదా అంటూ గల్లా జయదేవ్  వ్యాఖ్యలు?: అసలు ఎంపీ ఏమన్నారంటే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘యువగళం పాదయాత్రపై నమ్మకం లేకనే పాదయాత్రకు వెళ్లలేదని.. ఈ పాదయాత్ర వల్ల ఒరింగింది ఏమీ లేదు. అర్ధరాత్రి దాటాక పాదయాత్ర ఏంటని.. పార్టీలో కొందరు మతి పోయినట్లుగా ప్రవర్తిస్తున్నారని.. పద్దతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారం టీడీపీలో సైతం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ లోకేశ్ పాదయాత్రలో గల్లా జయదేవ్ కనిపించకపోవడంతో ఒకవేళ నిజంగానే చేసి ఉంటారేమోన్న అనుమానం కూడా కలిగింది. అయితే ఈ ప్రచారంపై గల్లా జయదేవ్ ట్విటర్ వేదికగా స్పందించారు. నారా లోకేశ్‌, యువగళం పాదయాత్రపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించారు.‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీద, ఆయన తలపెట్టేన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్‌లో మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను ఈ వాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా, ఒట్టి నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు. నేను ఈ వార్తలని, వీరు అవలంబించిన పద్ధతులని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ట్విటర్ వేదికగా తెలిపారు. ఇకపోతే యువగళం పాదయాత్రపై నమ్మకం లేకనే పాదయాత్రకు వెళ్లలేదని.. ఈ పాదయాత్ర వల్ల ఒరింగింది ఏమీ లేదు. అర్ధరాత్రి దాటాక పాదయాత్ర ఏంటని.. పార్టీలో కొందరు మతి పోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. అంతేకాదు ‘ముందుగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తేనే ఇప్పటి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుందని లోకేశ్‌ను ఏపీ ప్రజు నమ్మడం లేదని.. ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం శూన్యం. అందుకే యువగళం పాదయాత్రకు వెళ్లలేదు.. టీడీపీ హైకమాండ్ ఇకనైనా పునరాలోచన చేయాలి' అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని గల్లా జయదేవ్ తేల్చి చెప్పారు.

Next Story

Most Viewed