ఉండి టీడీపీలో ముసలం.. 20 ఏళ్ల సేవకు గుడ్ బై..!

by Disha Web Desk 16 |
ఉండి టీడీపీలో ముసలం.. 20 ఏళ్ల సేవకు గుడ్ బై..!
X

దిశ, వెబ్ డెస్క్: 20 ఏళ్లుగా ఆ పార్టీలో సేవ చేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజలకు పథకాలు అందజేశార. గత ఎన్నికల్లో పరాభవం ఎదురైనా భరించారు. ఇప్పుడే అదే జరుగుతుందడటంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉండి టీడీపీ రాజకీయం మారుతోంది. ఇప్పటి వరకూ ఈ నియోజకరవర్గాన్ని తెలుగుదేశం పార్టీ శాసించింది. ఇప్పటి వరకూ జరిగి ఎన్నికల్లో 7 సార్లు విజయం సాధించింది. రికార్డులను సైతం తిరుగరాసి బలమైన పునాదులు నిర్మించుకుంది. దీంతో 1985 నుంచి ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. జగన్ పాదయాత్ర వేవ్‌లో కూడా ఉండి నియోజకవర్గంలో టీడీపీనే గెలిచింది. ఇప్పుడు ఈ సెంటిమెంట్‌ను మరోసారి కొనసాగించేందుకు రెడీ అవుతోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే మళ్లీ సీటు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేటూకురి శివరామ వెంకట శివరామరాజు అలియాస్ కలవూడి శివ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో శివరామరాజు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. ఈసారి ఎన్నికల్లో తనకు సీటు వస్తుందని ఆశించారు.

అయితే అధిష్టానం మళ్లీ మంతెన రామరాజునే బరిలోకి దించుతుండటంతో శివరామరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ తనకే టికెట్ కావాలనే డిమాండ్ చేస్తున్నారు. కానీ అధిష్టానం శివరామరాజు వైపే మొగ్గుచూపడంతో పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. పార్టీ శ్రేణులతో సమావేశమైన అభిప్రాయం తీసుకున్నారు. శనివారం భవిష్యత్ కార్యకచరణ ప్రకటించే యోచనలో ఉన్నారు. 20 ఏళ్ల నుంచి తాను టీడీపీలో నిబద్ధతగా పని చేశానని, తన అభిప్రాయాన్ని తీసుకోకుండా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారని శివరామరాజు ఆవేనద వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ప్రజా క్షేత్రంలో ఉంటానని శివరామరాజు తేల్చి చెప్పారు. అయితే ఏ పార్టీలోకి వెళ్తాననే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. బహుశా.. శనివారం ప్రకటిస్తారేమో చూడాలి.

Read More..

ఈ సారి కేంద్రంలో ఆ పార్టీదే అధికారం.. తేల్చిచెప్పిన చంద్రబాబు



Next Story

Most Viewed