ఈ సారి కేంద్రంలో ఆ పార్టీదే అధికారం.. తేల్చిచెప్పిన చంద్రబాబు

by Disha Web Desk 19 |
ఈ సారి కేంద్రంలో ఆ పార్టీదే అధికారం.. తేల్చిచెప్పిన చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఈ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీపై టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోకి బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని బాబు జోస్యం చెప్పారు. ఏపీ పునర్నిర్మానికి కేంద్ర ప్రభుత సహయం ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్డీఏతో భాగస్వామిగా టీడీపీ ఉండటం ఈ నాటిది కాదని గుర్తు చేశారు. వైసీపీ విముక్త ఏపీ కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలబడ్డారని అన్నారు.

రాష్ట్ర ప్రజలు, ఏపీ భవిష్యత్ కోసం అందరం రాజీపడ్డామని.. ఇది సమాజ హితం కోసమే తప్ప స్వార్థం కోసం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి నూతన ఒరవడి సృష్టించాలనే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని బాబు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు మేలు, అభివృద్ధి జరగాలంటే ఏపీలో అధికార మార్పు అవసరమని.. అందుకే రాజ్యాధికారం తప్ప మా కోసం కాదని స్పష్టం చేశారు. యువత రాబోయే 30 ఏళ్ల భవిష్యత్ బాగుండాలంటే.. ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటు ఎంతో అవసరమని అన్నారు. ప్రజలు గెలవాలంటే వైసీపీ పోవాల్సిందేనని పిలుపునిచ్చారు.

జగన్ ఐదేళ్ల చేయరాని తప్పులన్నీ చేసి.. ఇప్పుడు తాను ఏకాకినంటున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హితం కోసమే పొత్తు పెట్టుకుని.. సీట్ల పంపకాల్లో ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరించామని క్లారిటీ ఇచ్చారు. మూడు పార్టీల్లో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదని తేల్చి చెప్పారు. పొత్తులో భాగంగా సీట్లు రానీ ఆశవహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మాన్ని పాటించి సహకరించాలని కోరారు. పార్టీ అధికారంలోకి వస్తే.. పార్టీ గెలుపునకు కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా బాబు హామీ ఇచ్చారు.

Read More..

శవాలపై పేలాలు ఏరుకునే పార్టీకి రేపు ఇంకెవరో..? వైరల్ అవుతున్న పోస్టర్

Next Story