తెలంగాణ కేబినెట్ వాయిదా.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..!

by Satheesh |
తెలంగాణ కేబినెట్ వాయిదా.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ క్రమంలో మంత్రి మండలి సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు ఏంటో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రాకపోవడంతోనే కేబినెట్ భేటీ జరపలేకపోయామని తెలిపారు. మంత్రి మండలి సమావేశం జరగనందున కీలక అంశాలు చర్చించలేకపోయామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించాలని అన్నారు. బ్యారేజీలకు మరమ్మత్తులు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఉన్నాయా పరిశీలించాలని చెప్పారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల పంప్ హౌజ్‌లను పరిశీలిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed