ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

by Sridhar Babu |
ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, కూసుమంచి : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూసుమంచి మండల కేంద్ర సమీప జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాలకు చెందిన ఉపేందర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో ఉపేందర్ శరీర భాగాలు రోడ్డుపై చల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించే ప్రయత్నం చేయగా శరీరమంతా నుజ్జునుజ్జు కావడంతో బస్తాల్లో మూటగట్టి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed