పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ని కలిపింది నాగార్జునేనా?.. ఇన్ని రోజులకు బయటపడ్డ అసలు నిజం!

by Jakkula Samataha |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు చెబితే చాలు యూత్‌లో ఫైర్ మొదలవుద్దీ. ఇక పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఉండే సందడే వేరు. ఆయన నటించిన తమ్ముడు

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌ని కలిపింది నాగార్జునేనా?.. ఇన్ని రోజులకు బయటపడ్డ అసలు నిజం!
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు చెబితే చాలు యూత్‌లో ఫైర్ మొదలవుద్దీ. ఇక పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఉండే సందడే వేరు. ఆయన నటించిన తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి లాంటి సినిమాలు ఇప్పటికీ చాలా మందికి ఇష్టం. ఇందులో కొన్ని సినిమాలు మళ్లీ రీ రిలీజై హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఏపీ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. మొన్నటితో ఎలెక్షన్స్ అయిపోవడంతో ఆయన కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? నాగార్జున తీసుకున్న ఓ నిర్ణయం పవన్ కళ్యాణ్‌ జీవితాన్నే మార్చేసిందంట. అది ఎలా అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ సినిమాల్లో బద్రీ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా ఈ సినిమాతోనే పవన్‌కు రేణుదేశాయ్ కూడా పరిచయమైంది. అయితే ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. మొదట కథను నాగ్‌కి వినిపించగా ఒకే చెప్పాడంట. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆయన రిజక్ట్ చేశాడు. తర్వాత ఇదే కథను పవన్‌కు వినిపించడంతో ఆయన ఒకే చేశాడు. ఇక ఇందులో హీరోయిన్‌గా రేణు దేశాయ్‌ను తీసుకున్నారు. ఈ సినిమాతోనే వీరి మధ్య ప్రేమ చిగురించి, చివరికి సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. కానీ వీరు ఇప్పుడు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌ను కలిపింది నాగార్జునే, ఆయన గనుక సినిమాను రిజక్ట్ చేయకపోతే, రేణు పవన్‌కు పరిచయం కాకపోయేది, వీరిద్దరి మధ్య లవ్,డివోర్స్ ఏవీ ఉండకపోవు అంటున్నారు నెటిజన్స్.

Next Story