Ap News: టీడీపీకి భారీ షాక్ .. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే పసల

by Disha Web |
Ap News: టీడీపీకి భారీ షాక్ .. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే పసల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పసల కనక సుందరరావు వైసీపీ గూటికి చేరారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పలువురు నేతలతో కలిసి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావుతోపాటు ఇతర నేతలకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు పలువురు నేతలు పాల్గొన్నారు.



Next Story