దేవీపట్నం మండలంలో మళ్లీ పులి సంచారం

by Bhoopathi Nagaiah |

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోకి మరోసారి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

దేవీపట్నం మండలంలో మళ్లీ పులి సంచారం
X

దిశ, దేవీపట్నం: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోకి మరోసారి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల దేవారం పరిసర ప్రాంతాల్లోని రామదుర్గం కొండ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు టెలీకాలర్ సిగ్నల్ అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో పులి సంచారం నమోదైన నేపథ్యంలో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పులి కదలికలను నిరంతరం పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అడవి అంచున ఉన్న గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళల్లో బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు. పశువులను అడవి ప్రాంతాలకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.

Next Story