Ap News: డెడ్‌బాడీ పార్శిల్ కేసు నిందితులకు రిమాండ్

by Vemula.Srinu Prasad |

డెడ్‌బాడీ పార్సిల్ కేసు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు

Ap News: డెడ్‌బాడీ పార్శిల్ కేసు నిందితులకు రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: డెడ్‌బాడీ పార్సిల్ కేసు(Deadbody Parcel Case)నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులకు భీమవరం కోర్టు(Bhimavaram Court) రిమాండ్ విధించింది. పర్లయ్య అనే వ్యక్తిని చంపి మృతదేహాన్ని పార్శిల్ చేసిన కేసులో నిందితులు శ్రీధర్‌వర్మ, రేవతి, సుష్మను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత మిస్టరీగా మారిన ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మను విచారించిన క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శ్రీధర్ వర్మ భార్య రేవతికి తన అక్క తులసితో ఆస్తి వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వదిన తులసిని భయపట్టేందుకు తన వద్దకు పని కోసం వచ్చిన పర్లయ్యను చంపి మృతదేహాన్ని తులసి ఇంటికి పార్శిల్ పంపారు. అయితే ఈ హత్య వెనుక శ్రీధర్ వర్మ ప్రియురాలు సుష్మ ప్రమేయం ఉన్న విషయం విచారణలో బయటపడింది.

అయితే డెడ్‌బాడీ పార్మిల్ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరిపిన పోలీసులు మిస్టరీని బద్ధలు కొట్టారు. దీంతో నిందితులు జైలు పాలయ్యారు. భీమవరం కోర్టు నిందితులకు జనవరి 9 వరకూ రిమాండ్ విధించడంతో తణుకు సబ్‌జైలుకు తరలించారు.

Next Story