- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్టీలో దొంగలున్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది. ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ టీడీపీ, జనసేన గెలుపు సభ ఇది అని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దొంగలపై పోరాటం చేయాలని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలియిక అని చంద్రబాబు చెప్పారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం తాను, పవన్ చేతులు కలిపినట్లు స్పష్టం చేశారు. అహంకారంతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ విముక్తి కోసమే టీడీపీ, జనసేన పొత్తు అని తెలిపారు. ఇది జనం కలిపిన పొత్తు అని, రాష్ట్రంలో వెలుగులు నింపబోతోందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి కీలకమని తెలిపారు. త్వరలో రాష్ట్రానికి నవోదయం రాబోతోందని చెప్పారు






