ఆస్తి కోసం దారుణం.. తల్లిదండ్రులపై కొడుకు, మనవళ్లు దాడి

by Vemula.Srinu Prasad |

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తాట గ్రామంలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులపైనే ఓ కొడుకు కర్కశత్వంగా విరుచుకుపడ్డాడు. ..

ఆస్తి కోసం దారుణం.. తల్లిదండ్రులపై కొడుకు, మనవళ్లు దాడి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) మొగల్తూరు మండలం కొత్తాట గ్రామం(Kothata Village)లో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులపైనే ఓ కొడుకు కర్కశత్వంగా విరుచుకుపడ్డాడు. ఆస్తి కోసం కన్నవారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దారుణంలో కొడుకు ఒక్కడే కాకుండా మనవళ్లు సైతం చేతులు కలపడం గమనార్హం. వృద్ధులని కూడా చూడకుండా రాడ్లు, కర్రలతో సూర్యనారాయణ, కస్తూరిబాయిలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పైగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా అక్కడి స్థానిక సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు.

ఎస్పీ నయీం అస్మీకి ఫిర్యాదు

అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నయీం అస్మీని బాధితులు ఆశ్రయించారు. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Story