- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళనలు.. మరోసారి ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి...

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Elutu District) పెదవేగి మండలం కొండలరావుపాలెం(Kondalaraopalem)లో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి(Former MLA Abbayya Chowdhury) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేపల చెరువుల లీజు బకాయిలు చెల్లించాలంటూ లంకగ్రామాల ప్రజలు, టీడీపీ(Tdp) శ్రేణులు ఆందోళనకు దిగారు. గతంలో పలుమార్లు నిరసన వ్యక్తం చేసినప్పటికీ అబ్బయ్య చౌదరి పట్టించుకోలేదు. దీంతో గురువారం మరోసారి లంగ్రామాల ప్రజలు ఆందోళనను ఉధృతం చేస్తారు. పామాయిల్ తోటలో ఉన్న అబ్బయ్య చౌదరిని అడ్డగించి ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన కారులను వైసీపీ(Ycp) కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కానీ లంకగ్రామాల ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
Next Story






