- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులపై దాడి.. ముగ్గురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు
పోలీసులపై దాడి చేసిన కేసులో ముగ్గురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) పుట్టిన రోజు వేడుకలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో పలుచోట్ల వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. దీంతో ఆయన ప్రాంతాల్లో నిబంధనలు అతిక్రమించిన వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దొరసానిపాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలో వెలుగులోకి వచ్చింది. వైసీపీ శ్రేణులు దొరసానిపాడులో ఆదివారం జగన్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత అనుచరుల వీరంగం సృష్టించారు. సైలెన్సర్లు తీసేసి బైక్‌తో భారీ శబ్ధం చేసుకుండా అర్ధారాత్రి రోడ్లపై తిరిగారు. దీంతో వారిని అడ్డుకోబోయిన పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదానికి దిగారు. పెట్రోల్ పోసి బైక్ అంటిస్తుండగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. వైసీపీ కార్యకర్తలు లక్కాబత్తుల సిద్దిరాజు సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.






