- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెనుకొండ | సినిమా లెవల్ చోరీ.. హవాల ముఠా నుంచి డబ్బు దోపిడీ
ప్రముఖ నటుడైన అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో స్మగ్లింగ్ ముఠాల వద్ద మరో ముఠా చోరీలకు పాల్పడడం చూపించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడైన అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో స్మగ్లింగ్ ముఠాల వద్ద మరో ముఠా చోరీలకు పాల్పడడం చూపించారు. అందులోనూ చేజింగ్ సీన్ లు ఆసక్తి కలిగిస్తుంటాయి. అలాంటి సినిమాటిక్ స్టైల్ లో ఓ చోరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని పెనుకొండలో (Penukonda) వెలుగు చూసింది. ఆదివారం అర్థరాత్రి సమయంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ హవాలా ముఠా డబ్బును తరలించేందుకు పెనుగొండ గుండా ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలో పెనుగొండ వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు ముఠాకు సంబంధించిన కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారులో నుంచి కొందరు గబగబా బయటకు దిగారు. హవాలా ముఠా (Hawala Money) వద్దనున్న డబ్బును తస్కరించుకొని తమ కారులోకి ఎక్కించుకున్నారు. ఏ మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పరారయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకొనే లోపు డబ్బు చోరీకి గురైంది. డబ్బులతో పాటు ముఠా సభ్యులను కూడా మరో ముఠా సభ్యులు కిడ్నాప్ చేసి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా అటుగా వెళ్తున్న ఓ కార్డు ఫ్రంట్ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే సదరు హవాలా ముఠా మూడు కోట్ల రూపాయలను కారులో తరలిస్తున్నారని పోలీసుల సమాచారం. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారపై జరిగిన ఈ సినిమాటిక్ చోరీతో ఓ వైపు ఆశ్చర్యం మరోవైపు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపును చేపట్టారు. ప్రమాదంలో దెబ్బతిన్న కారును పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.
సూరత్ కు చెందిన ఇద్దరి అరెస్ట్ : సీఐ రాఘవన్
పెనుకొండ దోపిడీ కేసులో కేసులో రూ.1.20 కోట్లు స్వాధీనం చేసుకున్నాం అన్నారు పెనుకొండ సీఐ రాఘవన్ వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. సూరత్ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అసలు ఏమి జరిగిందనే విషయంపై సమగ్ర విచారణ చేస్తున్నామని సీఐ తెలియజేశారు.






