మీ రుణం తీర్చుకోలేనిది.. వాలంటీర్లపై అప్యాయత కురిపించిన Nara Bhuvaneswari

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-10-09 10:35:16  IST  )

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారు.

మీ రుణం తీర్చుకోలేనిది.. వాలంటీర్లపై అప్యాయత కురిపించిన Nara Bhuvaneswari
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. అయితే ఆ సమయంలో యువగళం వాలంటీర్లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దాదాపు నెల రోజులు తర్వాత వారికి బెయిల్ మంజూరు అయింది. దీంతో వారంతా జైల్లో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్బంగా రాజమండ్రిలో నారా భువనేశ్వరిని యువగళం వాలంటీర్లను కలిశారు. ఆమె వారిని ఎంతో ఆప్యాయంగా పరామర్శించారు

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ పార్టీ కోసం జైలుకు వెళ్లిన యువగళం వాలంటీర్ల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి లోకేశ్‌కి వెన్నంటి ఉంటూ, చాలా సవాళ్ళను ఎదుర్కొన్న వాలంటీర్లకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story