- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ హింసను ప్రేరేపిస్తున్నారు: మంత్రి సంచలన ఆరోపణలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ హింసను ప్రేరేపిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు...

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి జగన్(Former Cm Jagan) హింసను ప్రేరేపిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు(Minsiter Nimmala Ramanaidu) ఆరోపించారు. రెంటపాళ్లలో జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయిన వైసీపీ కార్యకర్త ఘటనను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పరామర్శలపేరుతో జగన్ బలప్రదర్శన చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. జగన్ కు ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు జగన్ హింసను ప్రేరేపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తామంటూ శాంతి భద్రతలకు విఘాతం కలించేలా పరామర్శ పేరుతో యాత్ర చేశారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే తలలు నరుకుతామంటున్న వారిని జగన్ ఎలా సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తోందని, ప్రజలందరూ తమనే ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల కోరారు.






