- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జగన్ కుట్ర: మంత్రి నిమ్మల రామానాయుడు
తిరుమల శ్రీవారి ప్రతిష్టను భంగపరిచేలా వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారి ప్రతిష్టను భంగపరిచేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంతో పాటు యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రసాయనాల మిశ్రమంతో అపవిత్రం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని మంత్రి విమర్శించారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు రసాయనాలు కలిశాయని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొన్నా, జగన్ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవిత్రమైన శ్రీవారి పటాలను శాసనమండలిలో ప్లకార్డులుగా ప్రదర్శించడం దారుణమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం..
పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. పాలకొల్లులో రూ. 4.43 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. కొంతేరు గ్రామంలో రూ. 58 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కనికరం లేకుండా వ్యవహరించిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ నిష్పక్షపాతంగా పింఛన్లు అందిస్తోందని నిమ్మల పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంతో రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.






