- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకివీడు రామాలయం అంశం: రఘురామకృష్ణంరాజుపై మందకృష్ణ మాదిగ అసహనం
ఆకివీడు రామాలయం అంశంపైపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఆకివీడు రామాలయం అంశంపై (Akiveedu Ram Temple dispute)పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(MRPS Founding President Mandakrishna Madiga) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం హైకోర్టు(High Court)లో విచారణ జరుగుతున్నందున తీర్పు వెలువడిన తర్వాతే తమ పూర్తి స్పందనను తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి పేరుతో వెనుకబడిన వర్గాలను, బలహీన వర్గాలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని మందకృష్ణ హెచ్చరించారు. ఈ వివాదమంతా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చుట్టూనే తిరుగుతోందని తెలిపారు.
రఘురామకు సరికాదు
కూటమి ప్రభుత్వ విజయంలో తాము ప్రధాన భాగస్వాములుగా ఉన్నామని మందకృష్ణ గుర్తు చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా రఘురామ మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వానికి కీడు జరిగే అవకాశం ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని మందకృష్ణ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మందకృష్ణ స్పష్టం చేశారు.






