Road Accident: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు విద్యార్థుల మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-26 12:54:44  IST  )

కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది...

Road Accident: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు విద్యార్థుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు అమలాపురం వెళ్తుండగా వారిని మృత్యువు కబళించింది. మృతులు కండ్రిగ, ముక్కామలకు చెందిన నాగేంద్ర, రాజేశ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story