- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ నోట్ల ముఠా కీలక నిందితుడి అరెస్ట్
ఇటీవల ద్వారకాతిరుమలలో పట్టుబడ్డ దొంగ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, ద్వారకాతిరుమల: ఇటీవల ద్వారకాతిరుమలలో పట్టుబడ్డ దొంగ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లతో పాటుగా పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) భీమడోలు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి రెండో తేదీన ద్వారకాతిరుమలలో దొంగ నోట్లు మారుస్తున్న ఒక ముఠాను అరెస్ట్ చేశామన్నారు.
ఆ ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజ పరారీలో ఉన్నాడని, అప్పటి నుంచి అతని కోసం ముమ్మరంగా దర్యాప్తు చేసి అరెస్టు చేశామన్నారు. అతను గతంలో పలు కేసులలో ముద్దాయిగా ఉన్నాడని డీఎస్పీ వెల్లడించారు. ఇతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లు, ఒక కారు, నాలుగు బంగారపు రూపులు , ఉంగరం, రెండు ముక్కు పుడకలు, నల్లపూసల గొలుసు , వెండి స్పూను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో భీమడోలు సీఐ యుజె విల్సన్ , ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, భీమడోలు ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






