- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, పోలవరం: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా కోడిపందాలు, జూదం నిర్వహించరాదు, ఆడవద్దని జంగారెడ్డిగూడెం సిఐ బాలసురేష్ బాబు సూచించారు. బుధవారం ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు లక్కవరం మండలం దేవులపల్లిలో ప్రజలకు జూదం వలన కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ బాల సురేష్ బాబు మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా పచ్చని పల్లెల్లోని ప్రజలు పండుగ మూడు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ పండుగ జరుపుకోవాలని తెలిపారు. పేకాట కోడి పందాలకు దూరంగా ఉండాలని, జూద క్రీడల వలన కేసుల బారిన పడి కుటుంబ సభ్యులను ఇబ్బంది పాలు చేయొద్దని సీఐ బాల సురేష్ తెలిపారు.
Next Story






