Ap News: పొత్తుకే ‘పశ్చిమ’ పట్టం.. టీడీపీ, జనసేన గెలిచే సీట్లు ఎన్నో తెలుసా?

by Disha Web Desk 16 |
Ap News: పొత్తుకే ‘పశ్చిమ’ పట్టం.. టీడీపీ, జనసేన గెలిచే సీట్లు ఎన్నో తెలుసా?
X
  • టీడీపీ-జనసేన పొత్తుకే పశ్చిమ ప్రజల ఓటు
  • పొత్తులో 15 సీట్లలో విజయం
  • టీడీపీ-10, జనసేన-5
  • విడివిడిగా పోటీ చేస్తే టీడీపీ-5,జనసేన-3
  • 2014లో పొత్తులో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు
  • విడివిడిగా పోటీ చేయడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు
  • ఈసారి ఆ ఛాన్స్ ఇచ్చేది లేదంటున్న టీడీపీ, జనసేన

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలనే లక్ష్యంతో అటు చంద్రబాబు ఇటు పవన్ కల్యాణ్‌లు కంకణం కట్టుకున్నారని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. గాడి తప్పిన పాలనను సన్మార్గంలో పెట్టడమే ఇరువురు నేతల ప్రధాన లక్ష్యమని ఇరు పార్టీలు చెప్తున్నాయి. దాదాపు పొత్తు కన్ఫర్మ్ అయ్యిందని..ఇక సీట్ల విషయంపైనే చర్చ జరుగుతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి కలిసొచ్చిందని ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని ఇరు పార్టీల అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొత్తులకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైసీపీ, టీడీపీ-జనసేన పార్టీలు ఎన్ని సీట్లలో గెలుపొందుతాయి అనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది.

సింగిల్‌గా అయినా ఒకే

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సర్వేల పేరుతో అనేక సంస్థలు నివేదికలు బయటపెట్టడం... ఎన్నికల్లో హీట్ పెంచడం తరచూ జరుగుతూ ఉండేదే. పొత్తులు లేకుంటే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుంది.. పొత్తు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేదానిపై కూడా పలు సంస్థలు సర్వే చేసి ఫలితాలను సైతం బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్ల పంపకాలపై సర్వేలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేస్తే 5 సీట్లలో టీడీపీ గెలుపొందితే 3 సీట్లలో జనసేన గెలుపొందుతుందని సర్వేల్లో తేలినట్లు ప్రచారం జరుగుతుంది.

వార్ వన్‌సైడ్

మరోవైపు టీడీపీ-జనసేన పొత్తులతో వెళ్తే ఇక తిరుగులేదని తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో టీడీపీకి మంచి పట్టు ఉంది. అలాగే జనసేనకు సైతం మంచి ఆదరణ ఉంది.గతంలో టీడీపీ ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తే 2019 ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. అందుకు పొత్తులేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ జిల్లాలో టీడీపీ, జనసేనలకు మంచి ఓటింగ్ ఉంది.గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల చీలిపోయి రెండు పార్టీలు నష్టపోయాయని ప్రజలు సర్వేలు సైతం తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీకి జనాదరణ పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే జనసేనకు సైతం ఓటింగ్ పర్సంటేజి పెరిగింది. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం టీడీపీకి 10, జనసేనకు 5 సీట్లలో పట్టు ఉన్నట్లు జిల్లా నాయకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు సమీపించే నాటికి రాజకీయ పోరు తీవ్రమైతే వార్ వన్‌సైడ్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా క్లీన్ స్వీప్ అయిన అవ్వొచ్చు అనే ప్రచారం జరుగుతుంది.

అలా అయితే వైసీపీకి భారీ డ్యామేజ్

ఇకపోతే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాపుల ప్రాబల్యం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కాపు ఓటింగ్ శాతం గతం కంటే ఈసారి మరింత పెరిగిందని పలు సర్వేలలో తేలింది. ఇకపోతే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో కూడా జనసేన పట్టు పెంచుకుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో జనసేనకు విపరీతమైన ఆదరణ ఉందని వచ్చే ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. అలాగే ఏలూరుతో పాటు మరో సీటు జనసేన అడుగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన పొత్తులో కనుక ఎన్నికలకు వెళ్తే వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదనే ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుపొందడానికి టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయడమే కారణమని తెలుస్తోంది. ఓట్లు చీలిపోవడంతో అది కాస్త వైసీపీకి కలిసొచ్చిందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఇవ్వకూడదనే లక్ష్యంతో టీడీపీ-జనసేన అధినేతలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Read more: Ap Politics: బీజేపీ పెద్దలతో చంద్రబాబు వరుస భేటీలు అందుకేనా..?


Next Story

Most Viewed