డ్రైనేజీలో 20 అడుగుల భారీ కొండచిలువ.. భీమవరం మండలంలో కలకలం

by Ramesh Naini |

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై గ్రామస్తుల్లో భయాందోళనలు సృష్టించింది.

డ్రైనేజీలో 20 అడుగుల భారీ కొండచిలువ.. భీమవరం మండలంలో కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై గ్రామస్తుల్లో భయాందోళనలు సృష్టించింది. గ్రామానికి సమీపంలో ఉన్న ఓ డ్రైనేజీ కాలువలో నుంచి పొలానికి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో ఈ భారీ కొండచిలువ బయటపడింది. అనుకోని అతిథిని చూసిన రైతు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సమాచారం ప్రకారం ఆ కొండచిలువ సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీ నుంచి పొలంలోకి నెమ్మదిగా కొండచిలువ కదులుతున్నట్లు వీడియో కన్పిస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా బంధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామంలో తరచూ డ్రైనేజీ కాలువల్లో వన్యప్రాణులు కనిపిస్తున్నాయని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. కొండచిలువకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story