రోడ్డు నిర్మాణంపై వైసీపీ నేతల వాగ్వాదం.. దిమ్మ తిరిగే హామీ ఇచ్చిన మంత్రి

by Vemula.Srinu Prasad |

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం మట్టపర్రులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్రామంలోని రోడ్డు సమస్యపై మంత్రి నిమ్మల రామానాయుడుకు వైఎస్సార్‌సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు...

రోడ్డు నిర్మాణంపై వైసీపీ నేతల వాగ్వాదం.. దిమ్మ తిరిగే హామీ ఇచ్చిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) పోడూరు మండలం మట్టపర్రు(Mattaparru)లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్రామంలోని రోడ్డు సమస్యపై మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Rama Naidu)కు వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలు వినతిపత్రం అందజేశారు. అయితే ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలంటూ వైసీపీ నేతలు మంత్రిని నిలదీశారు.

ఖచ్చితంగా పూర్తి చేస్తాం

దీంతో వైసీపీ నేతల డిమాండ్లపై మంత్రి నిమ్మల సానుకూలంగా స్పందిస్తూనే ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రూ. 1.3 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిధుల సర్దుబాటు కాస్త ఆలస్యమైనప్పటికీ, మట్టపర్రు రోడ్డు పనులను ఖచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సొంత డబ్బులతోనైనా రోడ్డును నిర్మిస్తాం

ఈ క్రమంలో మంత్రి నిమ్మల ఆసక్తికరమైన ఛాలెంజ్, హామీని ప్రజల ముందు ఉంచారు. ఒకవేళ ప్రభుత్వ నిధులతో 2029లోపు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోతే.. రూపాయి కూడా వెనకాడకుండా తన సొంత డబ్బులతోనైనా సరే మట్టపర్రు రోడ్డును నిర్మించి తీరుతానని సంచలన ప్రకటన చేశారు. దీంతో మంత్రి ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్‌తో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Next Story