పెరుగుతున్న గోదావరి.. అలర్ట్ ప్రకటించిన కలెక్టర్

by Vemula.Srinu Prasad |

ఏలూరు జిల్లాలో గోదావరి మళ్ళీ పెరుగుతోంది..

పెరుగుతున్న గోదావరి.. అలర్ట్ ప్రకటించిన కలెక్టర్
X

దిశ ప్రతినిధి, ఏలూరు: గోదావరి(Godavari) మళ్ళీ పెరుగుతోంది. గత నాలుగు రోజుల క్రితం ఉధృతంగా ప్రవహించు తగ్గుముఖం పట్టిన గోదావరి.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు(హెవీ Rains) తిరిగి పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు 28 అడుగులకు చేరుకుంది. ఈ నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. నదిలో ప్రవాహం 6 లక్షల క్యూసెక్కుల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అధికార యంత్రాంగం,ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ప్రజలు ఎవ్వరు నదిలోకి వెళ్లవద్దని..ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దని కలెక్టర్ సూచించారు.

Next Story