- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురు అరెస్ట్ , నాలుగు తుపాకులు స్వాధీనం
లైసెన్సులు లేని నాటు తుపాకులు కలిగి వున్న నలుగురు వ్యక్తులను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు...

X
దిశ, ఏలూరు: లైసెన్సులు లేని నాటు తుపాకులు కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. గణవరం మండలం చినరామచంద్రాపురం వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన నక్కల శివకుమార్, మీనంపాతం రవి, అజయ్, నక్కల మురళి అలియాస్ మక్రాసింగ్ మురళి నాటు తుపాకులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అయితే నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిని పట్టుకుని తుపాకులను సీజ్ చేశారు. రొయ్యలు, చేపల చెరువులపై పక్షులను తోలేందుకు నాటు తుపాకులు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా నాటు తుపాకులు వినియోగిస్తే ఆయా చెరువుల యజమానులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read More..
Next Story






