- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను, నా కుటుంబాన్ని అంతమొందించే కుట్ర చేస్తున్నారు: అబ్బయ్య చౌదరి
నన్ను, నా కుటుంబాన్ని అంతమొందించే కుట్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) దెందులూరు(Denduluru)లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఓ వేడుకలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Mla Chinthamaneni Prabhakar) కారుకు మాజీ ఎమ్మెల్యే అబ్చయ్య చౌదరి(Former Mla Abbaiah Chowdary) వాహనాన్ని అడ్డు పెట్టారు. దీంతో అబ్చయ్య చౌదరి కారు డ్రైవర్‌పై చింతమనేని మండిపడ్డారు. దుర్భాషలాడారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిణామంతో దెందులూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేనిగా మారిపోయింది. దీంతో పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే అబ్బయ్య చౌదరి గొడవలకు ప్రేరిపిస్తున్నారని చింతమనేని అన్నారు. తమ వాళ్లను తిడితే చూస్తూ కూర్చుంటారా అని మండిపడ్డారు. మరోవైపు అబ్చయ్య చౌదరి కూడా మీడియాతో మాట్లాడారు. తనను, తన కుటుంబాన్ని అంతమొందించే కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందని అబ్బయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ‘‘చింతమనేని కారుకు మా కారు అడ్డుపట్టలేదు. కావాలనే చింతమనేని నానా యాగీ చేశారు. మా డ్రైవరును బూతులు తిట్టారు. చింతమనేని కారు వెళ్తేందుకే సరిపడా స్థలం ఉంది. చింతమనేని తీరును అటు టీడీపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. వైసీపీ నాయకులపై చింతమనేని కక్ష సాధింపులకు దిగారు.’’ అని అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.






