- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eluru | లింగపాలెం బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే విచారం
లింగపాలెం శివారులో జరిగిన బస్సు ప్రమాదంపై చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ (MLA Roshan Kumar) విచారం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : లింగపాలెం శివారులో జరిగిన బస్సు ప్రమాదంపై చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ (MLA Roshan Kumar) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రవాణ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు జరుగుతోందన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లాలోని చింతలపూడి సమీపంలోని లింగపాలెం (Lingapalem) శివారు జూబ్లీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీ కొట్టి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బస్సు డ్రైవర్ రాజ్ కుమార్ ఉదయం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. బస్సు ప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.






