దొరికిన సొమ్ము అప్పగింత.. యాచకురాలి నిజాయితీపై ప్రశంసలు

by Vemula.Srinu Prasad |

భీమడోలు బస్టాండు పరిసర ప్రాంతాల్లో చిన్న పిల్లతో బిక్షాటన చేసుకునే యాచకురాలి నిజాయితీని సీఐ విల్సన్, ఎస్సై బాషా అభినందించారు..

దొరికిన సొమ్ము అప్పగింత.. యాచకురాలి నిజాయితీపై ప్రశంసలు
X

దిశ, భీమడోలు: భీమడోలు బస్టాండు పరిసర ప్రాంతాల్లో చిన్న పిల్లతో బిక్షాటన చేసుకునే యాచకురాలి నిజాయితీని సీఐ విల్సన్, ఎస్సై బాషా అభినందించారు. కాకినాడ జిల్లా కొండలరావు ప్రాంతానికి చెందిన జువ్వల సత్యనారాయణ ప్రయాణంలో భాగంగా భీమడోలు బస్టాండ్‌లోదిగారు. ఇదే సమయంలో తన జేబులో ఉన్న రూ.36,000 నగదు గల్లంతయినట్టు గుర్తించారు. భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త లేని కారణంగా తన చిన్న పిల్లతో యాచకం చేసుకుంటూ జీవిస్తున్న తిరుమల శెట్టి కరుణ అనే మహిళకు ఆ సొమ్ములు దొరికాయి. వాటిని తీసుకున్న యాచకురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదరు తనకు దొరికిన తీరు వివరిస్తూ ఆ సొమ్మును పోలీసులకు అప్పగించింది. పోలీసులు సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి యాచకురాలు చేతుల మీదిగా సొమ్ము పోగొట్టుకున్న వ్యక్తికి అందజేశారు. యాచకురాలి నిజాయితీని భీమడోలు పోలీసులతోపాటు, సొమ్ములు పోగొట్టుకుని తిరిగి పొందిన సత్యనారాయణ అభినందించారు

Next Story