గ్యాస్‌ కొరత లేదు: ఎమ్మార్వో బి. రమాదేవి

by Vemula.Srinu Prasad |

భీమడోలు మండల పరిధిలో వంటగ్యాస్ కొరత లేదని, సిలిండర్ రీఫిల్ కోసం బుక్ చేసిన మూడు రోజుల వ్యవధిలోగా గ్యాస్ సరఫరా చేస్తామని హెచ్.పి. గ్యాస్ ఏజెన్సీ హామీ ఇచ్చిందని తహసిల్దార్ బి. రమాదేవి తెలిపారు. ..

గ్యాస్‌ కొరత లేదు: ఎమ్మార్వో బి. రమాదేవి
X

దిశ, భీమడోలు: భీమడోలు మండల పరిధిలో వంటగ్యాస్ కొరత లేదని, సిలిండర్ రీఫిల్ కోసం బుక్ చేసిన మూడు రోజుల వ్యవధిలోగా గ్యాస్ సరఫరా చేస్తామని హెచ్.పి. గ్యాస్ ఏజెన్సీ హామీ ఇచ్చిందని తహసిల్దార్ బి. రమాదేవి తెలిపారు. గ్యాస్ కొరత వార్తలు వస్తున్న నేపథ్యంలో భీమడోలు హెచ్.పి. ఏజెన్సీని తహసిల్దార్ సందర్శించారు. రీఫిల్ గ్యాస్ బుకింగ్, సరఫరా ఇతర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సరఫరా వివరాలను గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ రాంబాబు తహసిల్దార్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో భీమడోలు గ్రామ రెవెన్యూ అధికారి వినయ్ పాల్గొన్నారు.

Next Story