మొంథా తుఫాను దెబ్బతో నష్టపోయిన ఆక్వా రైతులు

by Thanuru Gopichand |   (  Updated:2025-10-29 09:33:28  IST  )

మొంథా తుఫాను దెబ్బతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు (Aqua Farmers) నష్టపోతున్నారు.

మొంథా తుఫాను దెబ్బతో నష్టపోయిన ఆక్వా రైతులు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను దెబ్బతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు (Aqua Farmers) నష్టపోతున్నారు. సముద్రం నీరు చేరడంతో పెద్దమైనవానిలంక, చిన్నమైనవానిలంక ప్రాంతాల్లో ఆక్వా చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చెరువులకు గండి పడడంతో చెరువుల్లోని రొయ్యలు (Prawns) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గండి పూడ్చడానికి ఆక్వా రైతులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రొయ్యలను పట్టుకుందామంటే పనివారు కూడా అందుబాటులో లేరని ఆక్వా రైతులు వాపోతున్నారు. లక్షల రూపాయలను వెచ్చించి రొయ్యల చెరువులు వేస్తే మొంథా తుఫాను దెబ్బకు అవి గోదావరిలోకి, సముద్రంలోకి పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మిగిలిందైనా అమ్ముకుందామంటే ఇదే అదనుగా భావించిన దళారులు (Mediators) ఆక్వా రైతులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. చెరువుల్లోక్లి సముద్రం నీరు చేరడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని బాధపడుతున్నారు. సునామీ తరువాత ఇటువంటి పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

READ MORE .....

Cyclone Montha: ఈ ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి..?

Next Story