ఉప్పుటేరు ఆక్రమణలపై రఘురామ ఆగ్రహం.. రోబోల్లా తామే తొలగిస్తామని హెచ్చరిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-27 15:56:16  IST  )

ఉప్పుటేరు ఆక్రమణలను తొలగించకపోతే కొంప కొల్లేరే అను నానుడి కచ్చితంగా జరుగుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు....

ఉప్పుటేరు ఆక్రమణలపై రఘురామ ఆగ్రహం.. రోబోల్లా తామే తొలగిస్తామని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఉప్పుటేరు(Upputeru) ఆక్రమణలను తొలగించకపోతే కొంప కొల్లేరే అను నానుడి కచ్చితంగా జరుగుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(AP Deputy Speaker Raghuramakrishnam Raju) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) ఆకివీడు, కైకలూరులో ఉప్పుటేరును ఎమ్మెల్యే కామినేనితో కలిసి ఆయన పరిశీలించారు. ఉప్పుటేరు ఆక్రమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పుటేరు 237 మీటర్లు ఉండాలని, కానీ 60 శాతం ఆక్రమణలకు గురైందని రఘురామ మండిపడ్డారు. రైతులు స్వచ్ఛందంగా చేపలు, రొయ్యల చెరువులను తొలగించాలని చెప్పారు. లేనిపక్షంలో ప్రభుత్వం సాయంతో తామే రోబోల అవతావరం ఎత్తి చెరువులను తొలగిస్తామని హెచ్చరించారు.

Next Story