- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భళా శ్రీకృష్ణదేవరాయా..! టీడీపీ ఎంపీపై నెట్టింట్లో ప్రశంసల జల్లు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Sessions of Parliament) నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Sessions of Parliament) నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు 15 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్ల జాబితాల భద్రత, ఢిల్లీ పేలుడు, విదేశాంగ విధానాలు, ఆర్థిక పర్యావరణ భద్రత వంటి కీలక అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టున్నాయి. ఇక ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. మొత్తం 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్ధమవుతోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచే అణుశక్తి బిల్లు-2025 (Atomic Energy Bill-2025), ఉన్నత విద్యలో పర్యవేక్షణ కోసం ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు-2025 (Higher Education Commission of India Bill-2025) వంటి కీలక బిల్లులు ఉన్నాయి.
ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాల వేళ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu Srikrishna Devarayalu) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రియమైన ఆంధ్రప్రదేశ్ యువత, యువ మిత్రులారా.. రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా మీ అందరి నుంచి నేను వినాలనుంది! నేను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, మా టీడీపీ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ఏ అంశాలను బలంగా లేవనెత్తాలి..? ఈ రాష్ట్రం కోసం, మీ భవిష్యత్తు కోసం నిజమైన మార్పు తీసుకొచ్చే అంశాలు ఏమిటి అని మీరు భావిస్తున్నారో చెప్పండి. జనతా పాలన అంటే ప్రజలందరూ భాగస్వాములు అయ్యే పాలన. కాబట్టి మీరూ దీనిలో భాగం కండి. మీ ఆలోచనలు, సూచనలు కామెంట్లలో తప్పకుండా రాయండి! మీకు ముఖ్యమైన అంశాలను జాతీయ స్థాయిలో గట్టిగా వినిపించేలా కలిసి పోరాడదాం జై టీడీపీ.. జై ఆంధ్రప్రదేశ్!’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, సామాన్యుల నుంచి ఓ ఎంపీ అభిప్రాయాలను తీసుకుని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకులే మనకు కావాలి కదా అని మరోవైపు నెటిజన్లు అంటున్నారు.






