Nara Bhuvaneswari:‘వెల్ డన్ లోకేష్’.. నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో నేడు(శనివారం) ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం(Parent & Teacher Meeting) నిర్వహించారు

Nara Bhuvaneswari:‘వెల్ డన్ లోకేష్’.. నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నేడు(శనివారం) ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం(Parent & Teacher Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్లలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు(CM Chandrababu), విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పాల్గొన్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యార్థులతో(School Students) ముచ్చటించిన అనంతరం వారితో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ భోజనం అనంతరం వారి ప్లేట్లను మంత్రి లోకేష్ తీయడాన్ని ఆయన తల్లి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) ప్రశంసించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘వెల్ డన్ లోకేష్. చంద్రబాబు గారి ప్లేట్‌ని నువ్వు తీయడం, అక్కడి సిబ్బందికి నువు సాయం చేయడం తల్లిదండ్రుల పట్ల నీకున్న గౌరవాన్ని, అణకువను సూచిస్తోంది. నిజంగా స్ఫూర్తిదాయకం’ అని ఆమె ట్వీట్ చేశారు.

Next Story