- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో పెళ్లి.. నిద్రమత్తులో డాబాపై నుంచి పడి వరుడు మృతి
కాసేపట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో డాబా మీద నుంచి పడి వరుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా రాజాంలో ఈ దురదృష్ట ఘటన చోటు చేసుకుంది. మృతుడు సూర్యారావు అర్థరాత్రి 12:55కి పెళ్లి చేసుకోవాల్సి ఉంది.
రాత్రి ఉక్కపోత అధికం కావడంతో ఇంటి మేడపై సూర్యారావు పడుకున్నాడు. డాబాకు రెయిలింగ్ లేకపోవడంతో నిద్ర మత్తులో దొర్లి యువకుడు కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సూర్యారావును ఆస్పత్రిలో చేర్చారు. అయినా పరిస్థితి విషమించడంతో సూర్యారావు కన్నుమూశాడు. దీంతో పెళ్లింట ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story






