Weather Forecast: ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..

by Disha Web Desk 16 |
Weather Forecast: ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో ఫలితంగా రాబోయే మూడు రోజులపాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఆదివారం అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని ప్రజలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.



Next Story