- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నైరుతి మందగమనం.. ర్యాంప్ ఆడుతున్న సూర్య బ్రో.. సమ్మర్ 2.0 స్టార్ట్
రెండ్రోజలుగా కోస్తాంధ్రతీరంలో ఉన్న జిల్లాల్లో ఎండలు ఇరగకాస్తున్నాయి. ఉక్కపోత కూడా పెరగడంతో.. ప్రజలు అల్లాడుతున్నారు. నైరుతి మందగమనంతోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణశాఖ అంచనా వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రోహిణికార్తె (Rohini karthe) వచ్చిందంటే రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడి ఉంది. నిజంగానే రోహిణికార్తెలో కాచే ఎండలకు రోళ్లు పగిలిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది సరిగ్గా రోహిణికార్తె మొదలయ్యే సమయానికి నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) రావడం, భారీ వర్షాలు కురవడంతో ఆ ఎఫెక్ట్ లేకుండానే వేసవి దాదాపు పూర్తయింది. హమ్మయ్య ఇక ఉక్కపోత ఉండదని సేద తీరుతున్న ప్రజలకు సూర్య బ్రో షాకిచ్చాడు. రెండ్రోజలుగా కోస్తాంధ్రతీరంలో ఉన్న జిల్లాల్లో ఎండలు ఇరగకాస్తున్నాయి. ఉక్కపోత కూడా పెరగడంతో.. ప్రజలు అల్లాడుతున్నారు. నైరుతి మందగమనంతోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి వేడి పొడిగాలులు మొదలవ్వడంతో పాటు ఎండల తీవ్రత పెరిగింది.
సోమవారం విజయవాడలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. కాకినాడలో 41, మచిలీపట్నం 40, నెల్లూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మంగళవారం.. ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే.. మన్యం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.






