- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలహీనపడుతున్న మొంథా తుఫాను
రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు, జడి వానలతో హడలెత్తిస్తోన్న మొంథా తుఫాను ప్రభావం క్రమంగా బలహీనపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు, జడి వానలతో హడలెత్తిస్తోన్న మొంథా తుఫాను ప్రభావం క్రమంగా బలహీనపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను వల్ల కలిగే నష్టాన్నీ వీలైనంత నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనిత సహాయక చర్యలను సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటరు నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో తుఫాను బలహీన పడుతుండడం మంచి పరిణామంగా ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పటికీ తుఫాను కొంత మేర బలహీన పడినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఆరు గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే వాయుగుండం ప్రభావంతో నేడు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్ంయ, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్రాలో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.






