- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రాండిక్స్ సంస్థను ఆదుకునే చర్యలు తీసుకుంటాం : మంత్రి నారా లోకేష్
రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ బ్రాండిక్స్ ఇండియా సంస్థ ట్రంప్ టారిఫ్ ల కారణంగా నష్టపోతోందని ఆ సంస్థ ఇండియా డైరెక్టర్ పి.సి.దొరస్వామి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ బ్రాండిక్స్ ఇండియా సంస్థ ట్రంప్ టారిఫ్ ల కారణంగా నష్టపోతోందని ఆ సంస్థ ఇండియా డైరెక్టర్ పి.సి.దొరస్వామి అన్నారు. టారిఫ్ లు సంస్థ ఆదాయాన్ని దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు. ట్రంప్ టారీఫ్ ల కారణంగా దేశవ్యాప్తంగా దుస్తుల తయారీ రంగం ఇబ్బందులను ఎదుర్కొంటోందని దొరస్వామి మంత్రి నారా లోకేష్ కు తెలిపారు. తమ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ సంస్థను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరిస్థితిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించి పరిశ్రమను కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. అందులో భాగంగా తక్షణ ఉపశమన చర్యలు చేపట్టేందుకు హామీనిచ్చారు.






