- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం
మొంథా తుఫాను కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ (PVN Madhav) పెనమలూరు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మొంథా తుఫాను (Cyclone Montha) కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్శనలో పివిఎన్ మాధవ్ వెంట బిజెపి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు. వారు పొలాలను స్వయంగా సందర్శించి రైతులతో మాట్లాడారు. తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న తీరును పరిశీలించారు. రైతులు (Farmers) తమ ఆవేదనను పివిఎన్ మాధవ్ వద్ద వెల్లబోసుకున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తామని భరోసానిచ్చారు. మొంథా తుఫాను కారణంగా పంటను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.






