సమస్యలను పరిష్కరించి పనులు పూర్తి చేస్తాం

by Thanuru Gopichand |

వేగం పుంజుకున్న శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జి పనులు.

సమస్యలను పరిష్కరించి పనులు పూర్తి చేస్తాం
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరులోని శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్ (Shankar Vilas Central Railway Bridge) పనుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani ChandraShekar) అన్నారు. శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్ పనులను ఆయన శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ గుంటూరు నగరాభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. అవసరమైన అన్ని సాంకేతిక అనుమతులు (Technical Clearances) కూడా సాధించినట్లు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి తుది అనుమతి లభించిన వెంటనే, రాబోయే 10 నుంచి 15 రోజుల్లోనే భారీ క్రేన్లను రంగంలోకి దించుతామన్నారు. బ్రిడ్జి సెంటర్ పార్ట్ తొలగింపు పనులను యుద్ధప్రతిపాదికన ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

​ప్రాజెక్టులో ఎదురవుతున్న భూసేకరణ (Land Acquisition), స్థానిక షాపుల యజమానుల సమస్యలపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరిగాయన్నారు. వీటిని త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. నిధుల విషయంలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. తొలుత రూ. 100 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం భూసేకరణ, పరిహారంతో కలిపి సుమారు రూ. 160 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. జూలై 27, 2025న ప్రారంభమైన ఈ నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై, 2027 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.

Next Story