- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవదేవుడికి మహాపచారం.. అన్నీ అసెంబ్లీలోనే బయటపెడతాం : మంత్రి నారా లోకేశ్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి విషయానికి సంబంధించిన విషయాలన్నింటినీ రేపు అసెంబ్లీ వేదికగా బయటపెడతామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మండలిలో దేవదేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయటపెడతామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నేడు అసెంబ్లీ, మండలి సమావేశాలు పునఃప్రారంభమవ్వగా.. ఉభయ సభల ప్రారంభానికి ముందు ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై విమర్శలు చేశారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ ఎవరికీ బొట్టుపెట్టి పిలవరన్నారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తుచేశారు. దేవుడిని కూడా వైసీపీ రోడ్డుమీదికి తీసుకురావడం బాధాకరమని పేర్కొన్నారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం ఆక్షేపణీయమన్నారు. పైగా అందులో తప్పేముందని సమర్థించుకోవడంకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. లడ్డూకల్తీకి సంబంధించిన వాస్తవాలన్నింటినీ రేపు అసెంబ్లీలో బయటపెడతామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిటీ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Next Story






