‘ఆ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తాం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఇవాళ(శనివారం) ఉదయం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి దర్శించుకున్నారు.

‘ఆ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు నివేదిక ఇస్తాం’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఇవాళ(శనివారం) ఉదయం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి దర్శించుకున్నారు. మొదటగా మంత్రికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం మీడియాతో మంత్రి ఆనం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని పేర్కొన్నారు.

టీటీడీ(TTD)లో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నేడు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారయణ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఏపీలోని 160 ఆలయాల్లో నాణ్యమైన ప్రసాదాలను అందజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో 200కు పైగా ఆలయాల పునర్నిర్మాణం కోసం కామన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. సీఎం ఆదేశాలతో టీటీడీ, దేవాదయ శాఖలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

Next Story