Nandi Awards : త్వరలో నంది అవార్డులు అందిస్తాం : ఏపీ మంత్రి కందుల దుర్గేష్

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో త్వరలోనే నంది అవార్డులు(Nandi Awards) అందిస్తామని సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్(Minster Kandula Durgesh) పేర్కొన్నారు.

Nandi Awards : త్వరలో నంది అవార్డులు అందిస్తాం : ఏపీ మంత్రి కందుల దుర్గేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో త్వరలోనే నంది అవార్డులు(Nandi Awards) అందిస్తామని సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్(Minster Kandula Durgesh) పేర్కొన్నారు. నేడు విజయవాడలో 'భైరవం' సినిమా ట్రైలర్(Bhairavam Trailer) విడుదల కార్యక్రమానికి ఆయన హాజరయ్యి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో నంది అవార్డుల కార్యక్రమాన్ని మళ్లీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవార్డులు 2017 నుంచి ఆగిపోయాయని.. తెలుగు సినిమాలు, నాటకాల్లో బాగా చేసిన వాళ్లను సత్కరించే ఉద్దేశంతో ఈ అవార్డులన మళ్లీ ప్రారంభించబోతున్నట్టు తెలియజేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు.

నంది నాటక ఫెస్టివల్ అని ఒక పెద్ద ప్రోగ్రాం కూడా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్ల కోసం జాగా ఇస్తామని పేర్కొన్న మంత్రి .. హైదరాబాద్‌లో ఉన్న సినీ నిర్మాతలు, డైరెక్టర్స్, నటీనటులతో సమావేశం ఏర్పాటు చేసి.. వారి సహాయంతో ఏపీకి సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు.

Next Story