జాతి, కుల, మతాలకు అతీతంగా యోగాను పాటిస్తాం.. సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |

విశాఖపట్నం వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day) అట్టహాసంగా ప్రారంభమైంది

జాతి, కుల, మతాలకు అతీతంగా యోగాను పాటిస్తాం.. సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day) అట్టహాసంగా ప్రారంభమైంది. ఆర్కే బీచ్ వేదికగా జరగుతోన్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు అంగ వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తమైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల ప్రాంతాల్లో ఇవాళ యోగ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది యోగాలో పాలుపంచుకోవడం సంతోషకరమని అన్నారు.

11వ అంతర్జాతీయ యోగా డే రికార్డు నెలకొల్పబోతోందని పేర్కొన్నారు. యెగాతో మానసిన ప్రశాంతత లభిస్తుందని అన్నారు. 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్‌రోల్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 22 వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాధించారని తెలిపారు. సెప్టెంబర్‌లో సూపర్ లీగ్ ప్రారంభం అవుతోందని అన్నారు. రికార్డులు ఏవైనా మోడీకే సాధ్యమని కితాబిచ్చారు. యోగా మన జీవితంలో భాగం కావాలని.. జాతి, కుల, మతాలకు అతీతంగా యోగాని పాటిస్తామని తెలిపారు. విజన్ స్వర్ణాంధ్ర-2027 కూడా వికసిత్ భారత్ భాగమని పునరుద్ఘాటించారు. ఇవాళ ఒకేసారి.. ఒకేచోట యోగా చేయడం చారిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story