రైతులు నష్టపోతే ఆదుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

మొంథా తుఫాను కారణంగా రైతులు నష్టపోతే వారిని ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Minister Acchen Naidu) అన్నారు.

రైతులు నష్టపోతే ఆదుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను కారణంగా రైతులు నష్టపోతే వారిని ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Minister Acchen Naidu) అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, కింది స్థాయి సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. అయితే రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను ముందస్తు ప్రణాళికతో విజయవంతంగా అధిగమించామని గుర్తు చేశారు. రైతులు అనవసర ఆందోళనలకు గురై బాధపడొద్దని విన్నవించారు. పంట నష్టం వాటిల్లితే అందుకు తగిన పరిహారం ప్రభుత్వం ఇస్తుందన్నారు. అంతేకాకుండా రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Next Story