YS Jagan: మాకూ టైం వస్తుంది.. అప్పుడు సినిమా చూపిస్తాం

by Thanuru Gopichand |   (  Updated:2025-05-20 12:01:55  IST  )

మాకూ టైం వస్తుంది.. అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ ​జగన్ హెచ్చరించారు.

YS Jagan: మాకూ టైం వస్తుంది.. అప్పుడు సినిమా చూపిస్తాం
X

వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ ​బ్యూరో : మాకూ టైం వస్తుంది.. అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ ​జగన్ హెచ్చరించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ రోజు వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతి నిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి..అని రెడ్​బుక్​ను (Redbook) ఉద్దేశించి అన్నారు. ఈ కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూదన్నారు. కేసులు, జైళ్లకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు. మహిళలు అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు మీదు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వల్లభ నేని వంశీ (Vamsi) విషయంలో ఇలాగే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగం సురేష్ (Nandigam Suresh) సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు వృక్షం అవుతుందని మరిచిపోవద్దన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు మంచి రోజులు వస్తాయన్నారు.

Next Story